పోలీస్ వెబ్సైట్ లో బేగంపేట టానా వారి ఈ మేయిల్ అడ్రస్ గల్లంతైందని తెలుస్తుంది. నిన్న ఏ సీ పీ గారికి మరియు ఎస్ ఎచ్ ఓ గారికి ఒక ఈ మెయిల్ పంపించడం జరిగింది. 
కానీ, జీ మెయిలు వారు పంపిన రిప్లై చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అదేంటంటే ( మీరు పంపబడిన మెయిల్ అడ్రస్సు కనిపించడం లేదు అని...) ఇదేంటబ్బా అని పరిశీలిస్తే, పోలీసుల వెబ్సైట్ లో కనిపిస్తున్న ఈమెయిల్ అడ్రస్సు ఇంకా స్టేషన్ బయట కనిపిస్తున్న బోర్డు మీద ఉన్న మెయిల్ అడ్రస్, వెబ్సైట్ లో గల్లంతయ్యింది.
కావున... పోలీసులకు తెలంగాణ న్యూస్ పోర్టల్ తరపున సమాచారం అందించాము.